News March 4, 2025
అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మి-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: లోకేశ్

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని అభివర్ణించారు.
News March 4, 2025
15 కేజీల బంగారంతో పట్టుబడ్డ నటి

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాన్యా రావ్ DRI అధికారులకు పట్టుబడ్డారు. రాన్య 15రోజుల్లో 4సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు రాగానే ఆమెను విచారించారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని తెలిపారు. తాను మాజీ DGP రామచంద్రరావు కూతురినని ఆమె చెప్పారన్నారు.
News March 4, 2025
GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.