News March 29, 2025

అనుమానస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.

Similar News

News October 15, 2025

విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

image

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్‌కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News October 15, 2025

VZM: ఏపీఐఐసీ-పారిశ్రామిక భాగస్వామ్య మాసం ప్రారంభం

image

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ఏపీఐఐసీ-పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్ పేరిట నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలు నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని APIIC ప్రతినిధులు తెలిపారు.

News October 15, 2025

విజయనగరం జిల్లాలో 6,873 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

PMAY క్రింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలన్నారు.