News March 20, 2024

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.

Similar News

News January 11, 2026

కోడి పందేలలో గోదావరి జిల్లాలను తలదన్నేలా.?

image

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు.. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. అయితే గత కొన్నేళ్లు గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కృష్ణా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గన్నవరం మండలం అంబాపురం, గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతిపెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు.

News January 11, 2026

కృష్ణా జిల్లా ‘రెవెన్యూ’లో ఎన్నికల కోలాహలం!

image

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ కృష్ణా జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గ ఏర్పాటుకు నేడు ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవికి ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు పోటీ చేస్తున్నారు. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్నిక అనివార్యంగా తెలుస్తోంది. మచిలీపట్నంలోని రెవెన్యూ హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించి 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు.

News January 10, 2026

కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.