News March 20, 2024
అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్
ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.
Similar News
News September 8, 2024
కృష్ణా జిల్లాలో పలు రైళ్ల రద్దు
నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).
News September 8, 2024
NTR జిల్లాలో వారికి మాత్రమే సెలవు: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వరద ముంపునకు గురైన లేదా పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తోందని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News September 8, 2024
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.