News December 6, 2024

అనుమానాస్పద స్థితిలో తల్లీ, కూతురి మృతి

image

హోళగుంద మండలం హెబ్బటంలో గురువారం సాయంత్రం తల్లీ, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతించెందారు. కంబదహాల్‌కు చెందిన సకరప్పకు, ఇంగళదహల్‌కు చెందిన సలీమా(21)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హెబ్బటం వచ్చారు. వీరికి మూడేళ్ల కూతురు సమీరా ఉంది. గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, నీ కూతురు, మనవరాలు చనిపోయి ఉన్నారని పక్కింటి వారు తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.

Similar News

News November 6, 2025

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

image

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

News November 5, 2025

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

image

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News November 5, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.