News December 6, 2024
అనుమానాస్పద స్థితిలో తల్లీ, కూతురి మృతి

హోళగుంద మండలం హెబ్బటంలో గురువారం సాయంత్రం తల్లీ, కూతురు అనుమానాస్పద స్థితిలో మృతించెందారు. కంబదహాల్‌కు చెందిన సకరప్పకు, ఇంగళదహల్‌కు చెందిన సలీమా(21)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హెబ్బటం వచ్చారు. వీరికి మూడేళ్ల కూతురు సమీరా ఉంది. గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, నీ కూతురు, మనవరాలు చనిపోయి ఉన్నారని పక్కింటి వారు తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి తల్లి తెలిపారు.
Similar News
News April 17, 2026
స్వీయ గణనలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో నిర్ణీత పోర్టల్ ద్వారా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ విధానం పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె కోరారు.
News April 17, 2026
జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు జిల్లాలో పన్ను చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి పరిశ్రమకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.190 కోట్ల బకాయిలను త్వరగా వసూలు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు, పరిశ్రమల చెల్లింపులను పర్యవేక్షించాలని ఆమె కోరారు. డీడీఓలు తప్పనిసరిగా జీఎస్టీ-టీడీఎస్ కింద నమోదు కావాలని పేర్కొన్నారు.
News April 17, 2026
కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.


