News February 22, 2025
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News November 14, 2025
అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.
News November 14, 2025
ఇందిరా మహిళా శక్తి చీరల లక్ష్యాన్ని చేరాలి: ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల: మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ లక్ష్యాన్ని తప్పక చేరాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ అధికారులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు, యజమానులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. చీరల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు.
News November 14, 2025
PG పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ప్రకటించారు. ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.


