News August 25, 2024
అనుములంకలో కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి
గంపలగూడెం మండలం అనుములంక గ్రామానికి చెందిన కృష్ణ (62) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. మృతిచెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు, కాగా మృతుడు గత కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల వ్యాధి తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాగా చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి మృతిచెందాడన్నారు.
Similar News
News September 15, 2024
విస్సన్నపేట: బాలికపై హత్యాచారం
విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.
News September 15, 2024
లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో ‘కృష్ణా’
జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6363 వివిధ రకాల పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో 5413 క్రిమినల్ కేసులు ఉండగా 181 సివిల్, 484 చెక్ బౌన్స్ కేసులు, 85 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని జిల్లా జడ్జి అరుణ సారెక తెలిపారు.
News September 15, 2024
విజయవాడలో రాత్రివేళ పర్యటించిన మంత్రి
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాయకాపురం నున్న పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వేళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా పర్యటించారు. స్థానిక ప్రజలని కలిసి స్వయంగా మాట్లాడి ఆందోళన చెందవద్దని తెలిపారు. బుడమేరుకు వరద అంటూ ప్రచారం చేసిన ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బుడమేరుకు ఎటువంటి వరద రాదని ప్రజలు అధైర్యం పడవద్దని అన్నారు.