News March 22, 2024
అనుముల: ‘చేరికల కోసం కాదు.. రైతుల నీళ్లు కోసం గేట్లు ఎత్తండి’

కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే రైతులు రోడ్డు మీద పడ్డారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అనుముల మండలం కొట్టాల, చలమారెడ్డిగూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు. పార్టీలో చేరికల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ముందు నాగార్జునసాగర్ గేట్లెత్తి రైతులకు నీళ్లు ఇవ్వండని అన్నారు.
Similar News
News December 18, 2025
NLG: ముగిసిన పల్లె సంగ్రామం

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.
News December 17, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.


