News August 29, 2024
అనుముల: ముత్యాలమ్మకు బోనాలు

నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News December 23, 2025
NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
News December 23, 2025
NLG: 2025@విషాదాల సంవత్సరం

2025లో NLG జిల్లాలో పలు భారీ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. HYD-సాగర్, HYD- VJD, NKP- అద్దంకి హైవేలపై భారీ ప్రమాదాలు జగిరాయి. ఈ ప్రమాదాలలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. 2025లో రాచకొండ పరిధిలో (NLGలో కొంత భాగం ) మొత్తం 3,488 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 650 మంది మరణించినట్లు సమాచారం.
News December 23, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం


