News December 22, 2024

అనూష వైద్య చికిత్స బాధ్యత నాది: మంత్రి లోకేశ్

image

నూజివీడు ట్రిపుల్ ఐటీ (E1)విద్యార్ధి మురపాల అనూష(17) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని సాయం కావాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. పేద కుటుంబానికి చెందిన అనూష కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదని తెలుపగా.. తన కార్యాలయ సిబ్బంది ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటారని లోకేశ్ తాజాగా హామీ ఇచ్చారు. 

Similar News

News January 18, 2025

కలిదిండి: మాజీ సర్పంచ్‌ది ప్రమాదం కాదు.. హత్య

image

కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.

News January 18, 2025

కృష్ణా, NTR జిల్లాలపై చంద్రబాబు సంతృప్తి

image

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జుల మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురి మంత్రులను హెచ్చరించారు.

News January 18, 2025

కృష్ణా: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు

image

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- చర్లపల్లి(CHZ) మధ్య శనివారం ప్రత్యేక రైలును అధికారులు నడుపుతున్నారు. ఈ మేరకు రైలు నం.08549 VSKP- CHZ రైలును శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లలో 4 జనరల్ కోచ్‌లు, 9 స్లీపర్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 2.55 కి విజయవాడ, రాత్రి 9 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని వివరించారు.