News April 24, 2024

అనూహ్యంగా తెరమీదకు మాజీ ఎంపీ మంద

image

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించిన ఆయన కొద్ది రోజులకే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కలిసి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News

News October 13, 2025

MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

News October 13, 2025

MBNR: నీటి సమస్యనా.. ఫోన్ చేయండి

image

మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని నీటి సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని నగర పాలక సంస్థ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. నగర పాలక సంస్థ పరిధిలోని పైప్ లైన్ లీకేజిలు, తాగునీటి సరఫరా, పబ్లిక్ బోర్ రిపేర్, వీధి దీపాలు వంటి సమస్యలకు Toll free నంబర్ 7093911352 కాల్ చేయాలన్నారు. ఉదయం 09:00 నుంచి సాయంత్రం 06:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు.

News October 13, 2025

MBNR: గ్రీవెన్స్ డే.. 11 ఫిర్యాదులు- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ మేరకు 11 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు చట్టపరమైన సహాయం అందించడమే కాకుండా, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు.