News June 12, 2024

అనూహ్య పరిణామాల మధ్య టికెట్.. నేడు మంత్రి పదవి

image

చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొలుసు పార్థసారథి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. పెనమలూరులో వైసీపీ సిట్టింగ్ MLAగా ఉన్న ఆయనను చంద్రబాబు నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సైతం పరిష్కరించి క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించిన పార్థసారథి.. నూజివీడులో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరేసి తాజాగా మంత్రి పదవి చేపట్టనున్నారు.

Similar News

News March 20, 2025

MTM: ‘ఉద్యోగులు కర్మ యోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేయాలి’

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

News March 20, 2025

ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదు

image

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. గురువారం ఎస్‌ఐ విశ్వనాధ్ వివరాల మేరకు.. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీలో నివావసముంటున్న చందు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 20, 2025

కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

image

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.

error: Content is protected !!