News October 6, 2024
అన్నపూర్ణగా శ్రీ రాజరాజేశ్వరి

నెల్లూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 50వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఏసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.
News December 9, 2025
నెల్లూరు: కాలువలో డెడ్ బాడీ కలకలం

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పరిధిలోని బుడ్డి డ్రైన్ సమీపంలో ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. పంటకాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన 45 సంవత్సరాల పురుషుడు మృతదేహంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.


