News October 7, 2024

అన్నపూర్ణాదేవి అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల్లో ఒకటి గల బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఈరోజు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారు నేడు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. మొదటి రోజు నుంచే అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు నగరం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News October 28, 2025

HYD: జూబ్లీ బరిలో 29 మంది స్వతంత్రులు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో దిగగా.. 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నారు.

News October 28, 2025

HYD: రోగికి సేవల పేరిట మహిళను ఏపీకి తరలింపు!

image

రోగికి సేవచేయడానికెళ్లిన మహిళ తిరిగిరాని ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. హనుమాన్‌నగర్ గార్డెన్-IIలో బంకా హేమేశ్వరి(45) ఉంటుంది. OCT 25న ఉద్యోగానికెళ్తున్నట్లు కూతరు జయశ్రీ(22)కి తెలిపింది. సా.7:30కి తల్లి ఫోన్ కలవలేదు. 26న ఉ.9కి ఫోన్ చేస్తే రోగి కుటుంబం విజయవాడకు తీసుకెళ్లిందని చెప్పింది. రా.11కు మరోకూతురు తేజస్వికి వీడియో కాల్‌లో రోగిని చూపిస్తూ ఏడుస్తూ కాల్ కట్ చేసిందని PSలో ఫిర్యాదు చేసింది.

News October 28, 2025

జూబ్లీ ఎన్నికల్లో 569 కంట్రోల్ యూనిట్లు

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటిని సిరీస్ శ్రేణిలో ఏర్పాటు చేసి కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ మిషన్‌ను అనుసంధానిస్తారు. మొత్తం కంట్రోల్ యూనిట్లు 569, బ్యాలెట్ యూనిట్లు 2,442, వీవీ ప్యాట్లు 610 ఉపయోగించనున్నారు.