News January 28, 2025
అన్నమయ్య: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

ఇంటి స్థలం కోసం ఓ వ్యక్తి తిట్టాడని కనసానోళ్లపల్లి కార్పెంటర్ రవి(23) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. అతను మంగళవారం మృతి చెందాడు. కురబలకోట, కనసానోళ్లపల్లి రవి తల్లి పేరుతో ఉన్న ఇంటి స్థలాన్ని అదే ఊరు వ్యక్తి కబ్జాచేశాడు. ఈవిషయమై కబ్జాచేసిన వ్యక్తిని రవి తల్లి ప్రశ్నించగా ఇద్దరినీ తిట్టాడు. దీంతో రవి ఇంట్లో ఉరేసుకోగా మదనపల్లెకు తరలించి, అక్కడి నుంచి రుయాకు వెళ్లగా చనిపోయాడు.
Similar News
News December 4, 2025
ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!
News December 4, 2025
చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో ACB దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.


