News March 18, 2025

అన్నమయ్య: ఇద్దరు యువకులు దుర్మరణం

image

అన్నమయ్య జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పీటీఎంకు చెందిన శ్రీనివాసులు(22), చందు(22) బి.కొత్తకోటలో సినిమా చూడాలని సోమవారం రాత్రి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళుతూ, బూర్లపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడే మృతి చెందగా, చందును ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడన్నారు.

Similar News

News November 5, 2025

పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

image

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

News November 5, 2025

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

image

<>పంజాబ్<<>> నేషనల్ బ్యాంక్ 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: pnb.bank.in/

News November 5, 2025

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

image

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్‌ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్‌ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.