News March 17, 2025
అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News November 25, 2025
మన్యం: యువకుడి మృతదేహం లభ్యం

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం వద్ద ఆదివారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిందే. వారిలో ప్రతాప్, గోవింద నాయుడు మృతదేహాలు గుంప సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో సోమవారం ఉదయం లభించగా.. సాయంత్రం శరత్ కుమార్ మృతదేహం కోటిపాం కారెడ్లు వద్ద లభించినట్లు కొమరాడ ఎస్సై నీలకంఠం తెలిపారు. పోస్ట్ మార్టం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరిగినట్లు తెలిపారు.
News November 25, 2025
NLG: నా జోనల్కు నేనే రాజు.. నేనే మంత్రి!

NLG ఎస్సీ గురుకుల జోనల్ అధికారి తీరుతో చిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఆ అధికారి తీరుతో ఓ మహిళా ఉద్యోగి భర్త గుండెపోటుకు గురై మృతి చెందాడు. NKL గురుకుల సొసైటీలో 15ఏళ్లుగా ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళను అకారణంగా సదరు అధికారి బదిలీ చేయడంతో మానసిక వేదనకు గురై ఆమె భర్త మృతి చెందాడు. నా జోనల్కు నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్న ఆమె తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
News November 25, 2025
డిసెంబర్ 6న డల్లాస్లో మంత్రి లోకేశ్ పర్యటన

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.


