News March 17, 2025
అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News April 24, 2025
ఒంగోలు: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
PPM : ‘సోమవారం నుంచి ఇసుక సరఫరా కావాలి’

భామిని మండలంలోని నేరడి, పాలకొండలోని చినమంగళాపురం ఇసుక రీచుల వద్ద సోమవారం నుంచి ఇసుక సరఫరా కావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాకు సంబంధించి కలెక్టర్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News April 24, 2025
రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.