News March 3, 2025
అన్నమయ్య కలెక్టరేట్‌లో నేడు ప్రజా వేదిక.!

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
Similar News
News March 23, 2025
TODAY HEADLINES

* డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్‌లాల్
* కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
News March 23, 2025
₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.
News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.