News March 16, 2025
అన్నమయ్య: చింత చెట్టుపై నుంచి పడి రైతు మృతి

చింతకాయలు కోయడానికి చెట్టు ఎక్కిన ఓ రైతు ప్రమాదవశాత్తు కింద పడి మృత్యువాత పడ్డాడు. ఆదివారం సాయంత్రం పీటీఎం మండలంలో వెలుగు చూసిన ఘటనపై మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కందుకూరు పంచాయతీ, గొడుగువారిపల్లికి చెందిన రైతు కొత్తోల్ల వెంకటరమణ(55) ఊరికి సమీపంలో ఉన్న చింతచెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.
Similar News
News March 18, 2025
IPL: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్

మరో 5 రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్లు దిశా పటానీ, శ్రద్ధా దాస్, సింగర్స్ కరణ్ ఆజ్లా, శ్రేయా ఘోషల్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు టాక్.
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన సూర్యాపేట జిల్లా బిడ్డ

సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన నిమ్మనగోటి మల్లేశ్ ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటారు. రాష్ట్ర స్థాయిలో 50వ, జోనల్ స్థాయిలో 14వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పేదింటి బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించారని స్థానికులు అతడిని అభినందించారు. తన విజయంలో తల్లిదండ్రులు, మిత్రుల సహకారం ఉందని మల్లేశ్ తెలిపారు.
News March 18, 2025
బాసర గోదావరిలో దూకిన మహిళ.. కాపాడిన స్థానికులు

బాసర గోదావరి నదిలో దూకి నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సత్తేపల్లి లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న స్థానికులు చెన్నాగౌడ్, సాజిత్, ముజ్జు గమనించి ఆ మహిళలను గోదావరినదిలో నుంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.