News April 8, 2025

అన్నమయ్య జిల్లాకి రానున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

image

ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 12, 13వ తేదీల్లో అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ బనగానపల్లె నుంచి బయలుదేరి రాయచోటికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల కు రాయచోటిలో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. 5.30కు రాజంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

Similar News

News December 3, 2025

జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

image

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.

News December 3, 2025

రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మనోహర్

image

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్‌గా మెట్‌పల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన ఏడాది కాలం పాటు కొనసాగనున్నారు. పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్టుల స్థాపన తదితర ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో ఆయన పాలు పంచుకోవాల్సి ఉంటుంది.