News January 26, 2025
అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.
Similar News
News January 5, 2026
RKP: ఒంటరిగా బతకలేక SUICIDE

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని భగత్ సింగ్ నగర్‌లో బచ్చు సుదర్శన్(75) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య 20 ఏళ్ల క్రితమే మృతి చెందగా.. కుమారులు హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో ఒంటరితనం భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు.
News January 5, 2026
తిమ్మాపురం బీచ్‌లో వృద్ధురాలి మృతి

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్

SMలో గ్రోక్ AIతో మొదలైన <<18744158>>బికినీ ట్రెండ్<<>> భారతీయులను కంగారు పెట్టిన విషయం తెలిసిందే. నిండుగా దుస్తులున్న ఫొటోలనూ ఒక కమాండ్‌తో బికినీలోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు బాధితులయ్యారు. కేంద్రం సీరియస్ అయ్యి ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ తెలుగు స్టార్ హీరోలను తాకింది. ట్విటర్‌లో వారి ఫొటోలను కూడా కొందరు బికినీల్లోకి మారుస్తున్నారు.


