News May 11, 2024
అన్నమయ్య జిల్లాకు వచ్చిన 8 మంది ట్రైనీ ఐపీఎస్లు

ట్రైనింగ్లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి, భద్రతా పరమైన చర్యలను గురించి తెలుసుకొనేందుకు అన్నమయ్య జిల్లాకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచ్చేసారు. ఐపీఎస్ అధికారులు జిల్లా ఎస్పీని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు గురించి ట్రైనీ ఐపీఎస్లకు ఎస్పీ బి. క్రిష్ణా రావు వివరించారు.
Similar News
News July 8, 2025
కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.