News February 20, 2025
అన్నమయ్య జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ అన్నమయ్య: YS జగన్పై కేసు.. వైసీపీ నేత ఫైర్
✒ పీలేరులో రూ.1.40 కోట్ల అవినీతి: సీపీఐ
✒ తుమ్మచెట్లపల్లిలో వృద్ధుడిపై పైశాచికంగా దాడి
✒ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చెప్పుతో కొడతా: ఎమ్మెల్యే ఆది
✒ రాయచోటి మండలంలో 13 మంది అరెస్ట్
✒ అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
✒ గుంతలపేటలో దళితులపై దౌర్జన్యం.? (VIDEO)
✒ రాజంపేటలో LIC ఉద్యోగుల ధర్నా
Similar News
News December 1, 2025
అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం.. 50వేల మందికి శిక్షణ

అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం మిషన్’ను ప్రారంభించింది. WISER, Qubitech సహకారంతో 50 వేల మంది విద్యార్థులు, నిపుణులకు క్వాంటం టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న ప్రారంభం. ఫేజ్-1: ఫౌండేషన్ కోర్సు ఫీజు రూ.500. ఫేజ్-2: ఇందులో ప్రతిభ చూపిన టాప్ 3 వేల మందికి అడ్వాన్డ్స్ శిక్షణ పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
News December 1, 2025
KMM: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.


