News February 13, 2025
అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
News November 27, 2025
సినిమా అప్డేట్స్

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
News November 27, 2025
వరంగల్ ఎంజీఎంలో ఫిర్యాదుల పెట్టె

వరంగల్ ఎంజీఎంలో సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ సత్యశారద ఆసుపత్రిలో ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంజీఎంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలపై చాలా ఫిర్యాదులు చేశారు. పేషెంట్లు, వారి కుటుంబీలకు కలిగిన అసౌకర్యం, అధికారులు, సిబ్బంది అవినీతిపైన భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.


