News February 13, 2025
అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
News March 16, 2025
VKB: 12,901 మంది విద్యార్థులకు 68 కేంద్రాలు

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఈవో రేణుకాదేవి తెలిపారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12,901 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను నిర్వహించేందుకు 920 మంది అధికారులను నియమించినట్లు డీఈవో పేర్కొన్నారు.
News March 16, 2025
తోటి విద్యార్థిని రెండో అంతస్తు నుంచి తోసేసిన మరో విద్యార్థిని

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.