News July 15, 2024
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రామాపురం మండలం పాలన్న గారి పల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలన్న గారి పల్లెకు చెందిన నాగభాస్కర్ రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని స్కూటర్ ఢీ కొనడంతో కిందపడ్డాడు. వెంటనే వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 17, 2025
కడప: బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక

ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన చెంచయ్యగారి ప్రసాద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు గర్భం రావడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో జులైలో నిందితుడిపై పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఆ బాలిక ఇవాళ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది.
News October 16, 2025
కడప: ఈ టేస్ట్ ఎక్కడా రాదండోయ్.!

కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ కాదండీ. నోరూరించే వంటకాలు కూడా మా సొంతం. ఇక్కడ రాగి సంగటి-నాటుకోడి ఫేమస్. అంతేకాందండోయ్.. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జి తింటే ఆహా అనాల్సిందే. ఇక చెన్నూరు బిర్యానీ, గువ్వల చెరువు పాలకోవ, జమ్మలమడుగులో దొరికే కుష్కాను ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. ఇక దోశపై కారం పట్టించి.. కాస్త పప్పుల పొడి వేసి తింటే నోరూరాల్సిందే. ఇక పొంగనాలు తినని కడప జిల్లా వాసి ఉండరు.
#ప్రపంచ ఆహార దినోత్సవం