News July 15, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

రామాపురం మండలం పాలన్న గారి పల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలన్న గారి పల్లెకు చెందిన నాగభాస్కర్ రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని స్కూటర్ ఢీ కొనడంతో కిందపడ్డాడు. వెంటనే వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 16, 2024

కడప జిల్లాలో నేడు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలకు డీఈవో మర్రెడ్డి అనురాధ సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు.

News October 16, 2024

కడప జిల్లాకు రెడ్ అలర్ట్

image

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగండం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ కడప, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో ఈ రెండు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులను సిద్ధం చేశారు.

News October 16, 2024

సజావుగా ఇసుక పంపిణీ చేయాలి: కడప కలెక్టర్

image

ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.