News February 19, 2025
అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

అన్నమయ్య జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
Similar News
News September 16, 2025
ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
News September 16, 2025
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.