News March 1, 2025

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో.. 14,862 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST

Similar News

News December 4, 2025

Party Time: గ్రామాల్లో జోరుగా దావతులు

image

పంచాయతీ ఎన్నికల పుణ్యమాని గ్రామాల్లో దావతులు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో సాయంత్రం కాగానే పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటున్నారు. ఇందుకోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను గ్రూపుల వారీగా విభజించి మద్యం, స్టఫ్ సమకూరుస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రూపులకు దావత్ ఏర్పాటు చేయాల్సి రావడంతో అభ్యర్థుల చేతి చమురు భారీగానే వదులుతోంది.

News December 4, 2025

విశాఖ: క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

image

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా క‌రుణ‌కుమారికి ప్ర‌త్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా క‌లెక్ట‌ర్ రూ.లక్ష చెక్ అందజేశారు

News December 4, 2025

కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

image

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.