News March 4, 2025
అన్నమయ్య జిల్లాలో నేడు కూడా పెన్షన్ల పంపిణీ.!

అన్నమయ్య జిల్లాలో 1వ తేదీ నుంచి పెన్షన్‌లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి నేడు కూడా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాకుండా అనంతపురం, తిరుపతి, చిత్తూరు, , ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు కూడా ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News February 25, 2026
వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకు శ్రీశైలం జలాశయమే దిక్కుగా మారింది. గత 114 రోజుల్లోనే సాగర్ నుంచి 135 టీఎంసీల నీటిని వినియోగించగా, ప్రస్తుతం యాసంగి పంటలు చేతికి రావాలంటే మరో 81 టీఎంసీల నీరు అవసరం. శ్రీశైలం నుంచి కనీసం 45 టీఎంసీల నీరు వస్తేనే వేసవి గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 539 అడుగులకు చేరుకుంది.
News February 25, 2026
HNK: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదలుకానున్నాయి. జిల్లాలో మొత్తం 18,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అల్పాహారం తీసుకుని, గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్, పెన్నులతో పాటు సామగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలని, సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
News February 25, 2026
HYD: మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త!

మనిషిని కుంగదీస్తున్న మానసిక రోదన వెనక అనేక కారణాలు ఉన్నాయని మేడిపల్లి డా.సుప్రజ తెలిపారు. మనసు విశ్రాంతిని, మార్పును కోరుకుంటోందని చెప్పే సంకేతం. నీరసం, చిన్నదానికే కోపం, కన్నీళ్లు, నలుగురిలోకి వెళ్లలేకపోవడం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, SM వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫోన్లు దూరంపెట్టి నచ్చిన పనిచేస్తే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయన్నారు.


