News April 23, 2025

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News April 24, 2025

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు ముమ్మరం!

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు SP బిందుమాధవ్ ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ మణీష్ దేవరాజ్ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ MLC అనంతబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

News April 24, 2025

నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <>https://ttdevasthanams.ap.gov.in/<<>>

News April 24, 2025

గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

image

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్‌కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

error: Content is protected !!