News April 15, 2025
అన్నమయ్య జిల్లాలో ముగ్గురి మృతి

అన్నమయ్య జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. కలకడ మండలం దాసిరెడ్డిగారి పల్లెలో ఆదిలక్ష్మి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ములకల చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నప్ప చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కురుబలకోటలో కరెంట్ షాక్తో రమేశ్ మృతి చెందారు.
Similar News
News December 1, 2025
KMM: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.
News December 1, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.


