News January 25, 2025

అన్నమయ్య జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు

image

అన్నమయ్య జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. రైల్వే కోడూరు ఓసీ ఉమెన్, రాయచోటి బీసీ జనరల్, లక్కిరెడ్డిపల్లె ఓసీ జనరల్, మదనపల్లె ఓసీ ఉమెన్, వాల్మీకిపురం ఓసీ జనరల్, కలికిరి ఎస్సీ ఉమెన్, పీలేరు బీసీ జనరల్, ములకలచెరువు ఎస్సీ ఉమెన్, అంగళ్లులో బీసీ మహిళకు పదవులు దక్కనున్నాయి.

Similar News

News November 5, 2025

ఖమ్మంలోని గవర్నమెంట్ బ్యాంక్‌లో JOBS

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు రేపటితో ముగుస్తుంది. ఖమ్మంలో 99 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT

News November 5, 2025

SRSP UPDATE: 4 గేట్లే ఓపెన్

image

ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో SRSP గేట్లను మూసివేస్తున్నారు. బుధవారం ఉదయం 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.

News November 5, 2025

నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

image

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్‌వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsvizagnsb.nesnavy.in/