News December 1, 2024

అన్నమయ్య జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా డిసెంబర్ 2న సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 14, 2025

అర్జీల పరిష్కారానికి జవాబుదారిగా పనిచేయాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో బద్వేల్, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

News February 14, 2025

పోలీసులకు కడప ఎస్పీ సూచనలు

image

పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం కడపలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస అధికారులకు పలు సూచనలు చేశారు.

error: Content is protected !!