News January 25, 2025

అన్నమయ్య జిల్లాలో 11 కొత్త మద్యం షాపులు ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాకు 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మంజూరైన మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లు, గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వృత్తిని నమ్ముకున్నవారికి 11 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 5, 2025

సిరిసిల్ల: ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌

image

ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో స్పెషల్ లోక్ అదాలత్‌పై ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు.

News November 5, 2025

NLG: ఎట్టకేలకు రేషన్ సంచుల పంపిణీ!

image

రేషన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేషన్ సంచులు పంపిణీ చేయనున్నారు. గత నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచులను ఐఎంజీ గోదాములకు సరఫరా చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో సంచులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఎంజీ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా రేషన్ షాపులకు సంచులు చేరాయి.

News November 5, 2025

NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

image

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.