News January 25, 2025
అన్నమయ్య జిల్లాలో 11 కొత్త మద్యం షాపులు ఏర్పాటు

అన్నమయ్య జిల్లాకు 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మంజూరైన మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లు, గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వృత్తిని నమ్ముకున్నవారికి 11 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 16, 2025
జాతీయ స్థాయి పోటీలకు ఏటూరునాగారం బిడ్డలు ఎంపిక

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారానికి చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్ సాగర్, అర్జున్ ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా క్రీడాకారులను స్థానికులు అభినందించారు.
News February 16, 2025
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచులు!

IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోంగ్రౌండ్ విశాఖపట్నంలో రెండు మ్యాచులు ఆడనుందని సమాచారం. DC తన మిగతా మ్యాచులను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో 3 మ్యాచులు ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ సెంటర్ కింద పంజాబ్ ఈ స్టేడియాన్ని ఎంచుకుంది. వచ్చే నెల 22 నుంచి IPL ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ RCB vs KKR మధ్య ఉంటుందని సమాచారం.
News February 16, 2025
సంగారెడ్డి: రేపు విధులలో చేరాలి: డీఈవో

డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై నియామక పత్రాలు అందుకున్న నూతన ఉపాధ్యాయులందరు రేపు పాఠశాలలో విధులలో చేరాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఫిట్నెస్ సర్టిఫికెట్, అగ్రిమెంట్ కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రేపు సాయంత్రంలోగా పంపాలని సూచించారు.