News March 28, 2025
అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక సూచనలు

మీరు చేసే చిన్న క్లిక్‌తో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు యువతకు సూచనలు ఇస్తున్నారు. కస్టమర్ కేర్, వాట్సాప్ చిట్కాలు, ఈజీ మనీ కోసం కనిపించిన లింకులను క్లిక్ చేయొద్దన్నారు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. ప్రభుత్వ పథకాలు, వర్క్ ఫ్రమ్ హోం వంటి, ప్రకటనలకు ఆకర్షితులై లింక్ క్లిక్ చేయొద్దు అని హెచ్చరించారు.
Similar News
News December 23, 2025
పెద్దపల్లి: మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. మాదక రవాణా, సాగు, వినియోగాన్ని నియంత్రించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు.
News December 23, 2025
విశాఖలో అట్టహాసంగా ‘పీసా’ మహోత్సవం

విశాఖ పోర్ట్ స్టేడియంలో రెండు రోజుల పీసా (PESA) మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, కమిషనర్ కృష్ణతేజ, క్రీడాకారిణి జ్యోతి సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు 68 స్టాళ్లతో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఖేలో ఇండియా కబడ్డీలో మధ్యప్రదేశ్ (పురుషులు), జార్ఖండ్ (మహిళలు) విజేతలుగా నిలవగా, ఆర్చరీలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.
News December 23, 2025
BREAKING: భారత్ ఘన విజయం

వైజాగ్ వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 69*(11 ఫోర్లు, ఒక సిక్సర్), జెమీమా 26, స్మృతి 14, హర్మన్ ప్రీత్ 10 రన్స్ చేశారు. ఈ గెలుపుతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.


