News January 25, 2025
‘అన్నమయ్య జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు సూచించారు. ‘మీకు తెలియని వ్యక్తుల నుంచి గూగుల్ పే, ఫోన్పేకు కొంత డబ్బు వచ్చిందని సైబర్ నేరగాళ్లు మీకు మెసేజ్ పంపిస్తారు. మనం ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని టచ్ చేసి తిరిగి పంపించామో, మనం మోసపోయినట్టే. అమౌంట్ వచ్చినట్లు మీకు కనపడితే వెంటనే తప్పుడు పిన్ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మోసపోరు’ అని సూచించారు.
Similar News
News December 6, 2025
కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.
News December 6, 2025
ములుగు: 3వ విడత నామినేషన్లు ఎన్నంటే?

జిల్లాలో 3వ విడత సర్పంచ్, వార్డులకు నామినేషన్లు ముగిశాయి. 3వ విడతలో భాగంగా వాజేడులో సర్పంచ్-17 స్థానాలకు మొత్తం 87, వార్డు (335) నామినేషన్లు, వెంకటాపురం సర్పంచ్-18 స్థానాలకు 111, వార్డు (365), కన్నాయిగూడెం సర్పంచ్-11 స్థానాలకు 52, వార్డు (128) నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ నేడు మొదలు కానుంది.
News December 6, 2025
వ్యూహ లక్ష్మి పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలి?

శ్రీవారి హృదయస్థానంలో వెలసిన వ్యూహ లక్ష్మి అమ్మవారిని పసుపు ముద్రతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత, తొలగించిన పాత పసుపును భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీవారి ప్రత్యేక సేవల్లో, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ పవిత్ర పసుపు లభిస్తుంది. ఈ ప్రసాదం పొందిన వారికి సిరిసంపదలకు లోటు ఉండదని విశ్వాసం. వ్యూహ లక్ష్మి అమ్మవారికి 3 భుజాల ఉండటం వల్ల త్రిభుజ అని కూడా పిలుస్తారు.


