News January 25, 2025
అన్నమయ్య జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండండి

జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు సూచించారు. ‘మీకు తెలియని వ్యక్తుల నుంచి గూగుల్ పే, ఫోన్‌పేకు కొంత డబ్బు వచ్చిందని సైబర్ నేరగాళ్లు మీకు మెసేజ్ పంపిస్తారు. మనం ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని టచ్ చేసి తిరిగి పంపించామో, మనం మోసపోయినట్టే. అమౌంట్ వచ్చినట్లు మీకు కనపడితే వెంటనే తప్పుడు పిన్ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మోసపోరు’ అని సూచించారు.
Similar News
News November 22, 2025
ఏలూరు: ఈనెల 24న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14, 17 బాల, బాలికల క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 24న పెదవేగి మండలం వంగూరు ANM క్రికెట్ అకాడమీలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా దుస్తులు, బ్యాట్, బాల్, ప్యాడ్లతో హాజరుకావాలన్నారు.
News November 22, 2025
శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
బాపట్ల: ‘భూ సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి’

భూ సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి భూ అర్జీని నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు పాల్గొన్నారు.


