News January 25, 2025

‘అన్నమయ్య జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

image

జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు సూచించారు. ‘మీకు తెలియని వ్యక్తుల నుంచి గూగుల్ పే, ఫోన్‌పేకు కొంత డబ్బు వచ్చిందని సైబర్ నేరగాళ్లు మీకు మెసేజ్ పంపిస్తారు. మనం ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని టచ్ చేసి తిరిగి పంపించామో, మనం మోసపోయినట్టే. అమౌంట్ వచ్చినట్లు మీకు కనపడితే వెంటనే తప్పుడు పిన్‌ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మోసపోరు’ అని సూచించారు.

Similar News

News February 15, 2025

మోదీని నేను అగౌరవపర్చలేదు: సీఎం రేవంత్

image

TG: ప్రధాని <<15461493>>మోదీ కులంపై<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. మోదీని తాను వ్యక్తిగతంగా అగౌరవపర్చలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. అందుకే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

22 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల నటుడు

image

బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహమాడారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.

error: Content is protected !!