News January 25, 2025
అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.
Similar News
News November 4, 2025
దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.
News November 4, 2025
‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.
News November 4, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.


