News January 26, 2025
అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.
Similar News
News February 8, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం
News February 8, 2025
ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్

నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్‌తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్‌లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్‌కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్‌మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.
News February 8, 2025
తిరుపతి: హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు బాంబు బెదిరింపులు

తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌కు శనివారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ‘అచ్చి ముత్తు సవుక్కు శంకర్’ అనే పేరుతో వచ్చిన మెయిల్ చూసిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.