News March 20, 2025

అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా మహమ్మద్ అలీ

image

అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ నూతన సీఐగా బుధవారం ఎస్. మహమ్మద్ అలీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ నూతన ఇన్స్పెక్టర్‌కి సూచనలు చేశారు. సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, డేటా చోరీలు వంటివాటిపై సీఐ నిఘా పెంచి కేసులు ఛేదించాలని చెప్పారు.

Similar News

News November 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 1, 2025

స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 1, 2025

MHBD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వీరే.. UPDATE

image

హనుమకొండ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురవి మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కురవి మండలం సుధనపల్లికి చెందిన యువతికి బుధవారం కురవిలో వివాహం అయింది. నవ దంపతులు అదే రాత్రి అత్తగారింటికి వెళ్లారు. గురువారం నవ దంపతులను తీసుకొస్తున్న క్రమంలో ఆగి ఉన్న బొలెరోను బోర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కళమ్మ మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.