News February 25, 2025
అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

➢ ఓబుళవారిపల్లె: ఏనుగుల దాడిలో ముగ్గురి మృతి
➢ మదనపల్లె: నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు
➢ ఏనుగుల దాడిలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా
➢ మదనపల్లెలో షటిల్ ఆడుతూ వ్యక్తి మృతి
➢ రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశాడు: షాజహాన్ బాషా
➢ గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత
➢ అన్నమయ్య జిల్లా ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్
➢ రామసముద్రం: రేపు శివాలయాల్లో ఉత్సవాలు నిలిపివేత
Similar News
News December 6, 2025
మద్యం అమ్మకాలు.. ఐదురోజుల్లో రూ.940 కోట్లు

TG: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, కొత్త వైన్స్ ప్రారంభం కావడంతో అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 1-5 వరకు డిపో నుంచి ఏకంగా రూ.940 కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. DEC 1 నుంచి అమ్మకాలు చూస్తే.. రూ.183.05 కోట్లు, రూ.207.49 కోట్లు, రూ.187.52 కోట్లు, రూ.178.29 కోట్లు, రూ.185.02 కోట్ల బిజినెస్ జరిగింది. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
News December 6, 2025
దైవ ప్రసాదంతో ఈ తప్పులు వద్దు

ప్రసాదం ఆహారం మాత్రమే కాదు. అది దైవాశీర్వాదం కూడా! మిగిలిన ప్రసాదాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు. ప్రసాదాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచాలి. ఇతరులకు పంచాకే తినాలి. ప్రసాదం చెడిపోయే వరకు నిల్వ ఉంచకూడదు. ఒకవేళ అలా జరిగితే.. చెత్త బుట్టల్లో అస్సలు పడేయకూడదు. బదులుగా చెట్టు, మొక్కల మొదట్లో ఉంచాలి. తీర్థాలను కూడా కింద పారబోయరాదు. నేరుగా తాగరాదు. చేతిలోకి తీసుకున్నాకే స్వీకరించాలి.
News December 6, 2025
కాకర పంటను ఇలా సాగు చేస్తే మంచిది

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేస్తే పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. అలాగే దిగుబడి 40-50శాతం పెరుగుతుంది. కాకరను సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో మాత్రమే సాగు చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందిస్తే, ఎరువుల ఆదాతో పాటు, పెట్టుబడి కూడా కొంత తగ్గుతుంది. రసాయన పురుగు మందులే కాకుండా వేప ఉత్పత్తులతో కూడా చీడలను సంపూర్ణంగా నివారించి ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.


