News February 25, 2025

అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

image

➢ ఓబుళవారిపల్లె: ఏనుగుల దాడిలో ముగ్గురి మృతి
➢ మదనపల్లె: నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు
➢ ఏనుగుల దాడిలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
➢ మదనపల్లెలో షటిల్ ఆడుతూ వ్యక్తి మృతి
➢ రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశాడు: షాజహాన్ బాషా
➢ గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత
➢ అన్నమయ్య జిల్లా ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్
➢ రామసముద్రం: రేపు శివాలయాల్లో ఉత్సవాలు నిలిపివేత

Similar News

News March 26, 2025

బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

image

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.

News March 26, 2025

గర్భిణుల పథకానికి నిధులు ఏవి: సోనియా గాంధీ

image

గర్భిణులకు ఇచ్చే మాతృత్వ ప్రయోజనాల పథకానికి కేంద్రం పూర్తి నిధులు కేటాయించలేదని ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్‌కు రూ.12,000కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. 2022-23లో 68శాతం మంది ఒక విడత డబ్బులు తీసుకోగా ఆ తరువాతి సంవత్సరంలో ఆ సంఖ్య 12శాతానికి తగ్గిందన్నారు. జాతీయ ఆహర భద్రత పథకం కింద కేంద్రం రెండు విడతలలో గర్భిణులకు రూ.6వేలు ఇస్తుంది.

News March 26, 2025

SLBCని పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

image

TG: SLBC ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద పనులు ప్రారంభిస్తాం. కాళేశ్వరం డీపీఆర్, నిర్మాణానికి తేడా ఉంది. ఈ విషయంలో NDSA రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!