News April 7, 2025
అన్నమయ్య: డిప్యూటీ కలెక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

సంబేపల్లె మండలం, యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నారా చంద్రబాబునాయుడు సూచించారు.
Similar News
News September 17, 2025
భూమనకు నోటీసుల అందజేత

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో భూమన ఇంటికి ఎస్ఐ అజిత వెళ్లి నోటీసులు అందజేశారు. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు. ఏమాత్రం అవగాహన లేకుండా TTD అధికారి తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు.
News September 17, 2025
కామారెడ్డి: వరద సహాయక చర్యల్లో పోలీసుల అద్భుత ప్రతిభ

ఇటీవల KMR జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను త్వరితగతిన రక్షించిన పోలీసు శాఖ ధైర్య సాహసాలను రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ప్రశంసించారు. కామారెడ్డిలో బుధవారం జరిగిన ప్రజాపాలన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జిల్లాను నేర రహిత సమాజంగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన కోరారు.
News September 17, 2025
స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.