News April 8, 2025
అన్నమయ్య : డిప్యూటీ కలెక్టర్ మృతి.. ప్రమాదం జరిగింది ఇలా..!

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్‌కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.
Similar News
News January 6, 2026
కోనసీమలో ‘నిప్పుల’ జ్ఞాపకం.. పాశర్లపూడి నుంచి ఇరుసుమండ వరకు!

ఇరుసుమండ ONGC రిగ్ వద్ద సోమవారం <<1877026>>మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే<<>>. ఈ నేపథ్యంలో కోనసీమ జనం పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. 1995 జనవరి 8న పాశర్లపూడిలో జరిగిన ONGC బావి ‘బ్లోఅవుట్’ సుమారు 65 రోజుల పాటు నిప్పుల కొలిమిని తలపించింది. అదే తరహాలో 2014 జూన్ 2న నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలి 22 మందిని బలితీసుకుంది. ఆ భయానక మంటలు, ప్రాణనష్టం ఇప్పటికీ కోనసీమ జనం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.
News January 6, 2026
నవాబుపేట: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

నవాబుపేట మండలంలోని మీనపల్లి కలాన్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో, డ్రైవర్ గొల్ల శ్రీశైలం (37) కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News January 6, 2026
కొత్తూరు: భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా రీసర్వే

భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు రీసర్వే 2.0ను తీసుకువచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనిగాని సత్య ప్రసాద్ అన్నారు. అనకాపల్లి మండలం కొత్తూరులో సోమవారం మాట్లాడుతూ గత ప్రభుత్వ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చి రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


