News February 8, 2025

అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.

Similar News

News November 27, 2025

నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

image

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్‌ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్‌ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్‌మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.

News November 27, 2025

కృష్ణా: పక్వానికి రాకుండానే కోతలు.. నష్టపోతున్న రైతాంగం

image

మొంథా తుపాన్ సృష్టించిన భయమో లేక తరుముకొస్తున్న మరో తుపాన్ భయమో తెలియదు గానీ కృష్ణా జిల్లా రైతుల తొందరపాటు చర్యలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పక్వానికి రాని వరి పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు అమ్ముతుండటంతో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. పక్వానికి రాని ధాన్యాన్ని విక్రయించడంతో ఎక్కువగా తాలు, తప్పే వస్తున్నాయని, పక్వానికి వచ్చిన పంటనే కోయాలని అధికారులు రైతులకు సూచించారు.

News November 27, 2025

ఈనెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా HDB ఫైనాన్స్ కంపెనీలో 41 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. 18ఏళ్లు పైబడిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/vtBSqdutNxUZ2ESX8